: రియల్ డిక్టేటర్... ఉత్తర కొరియాలో ఆర్మీ చీఫ్ ను ఉరి తీయించిన అధ్యక్షుడు!
తన సార్వభౌమాధికారానికి అడ్డొస్తాడని భావిస్తూ, ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ జనరల్ చీఫ్ యోంగ్ గిల్ ను దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉరి తీయించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ కిమ్ జోంగ్ పక్కనే కనిపించే ఆయన గత కొంతకాలంగా కనిపించడం లేదని దక్షిణ కొరియా పత్రికలు వార్తలను ప్రచురించాయి. రాజకీయ కుట్రలు చేయడం, అవినీతికి పాల్పడటం వంటి అభియోగాలను మోపి, ఆయన్ను దారుణంగా హతమార్చారని యోన్ హాప్ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. సైన్యంపై తన పట్టును మరింతగా పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే కిమ్ ఈ శిక్షను అమలు చేయించినట్టు ఉత్తర కొరియా వర్గాలు వెల్లడించాయని ఏజన్సీ పేర్కొంది.