: గ్రేటర్ కు నేడు కొత్త పాలకవర్గం... మరికాసేపట్లో కేటీఆర్ తో టీఆర్ఎస్ కార్పొరేటర్ల భేటీ


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నేడు కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మెజారిటీ సభ్యులు ఉన్న పార్టీగా టీఆర్ఎస్ కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకుంటుంది. పార్టీ కార్పొరేటర్లుగా ఎన్నికైన బొంతు రామ్మోహన్ మేయర్ గా, బాబా ఫసియుద్దీన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కానున్నారు. ఈ మేరకు వీరిద్దరి నియామకానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మరికాసేపట్లో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో టీఆర్ఎస్ కార్పొరేటర్లు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కొత్త పాలకవర్గం ఎంపిక గురించి కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News