: టీఆర్ఎస్ అధినేత నా కళ్లలోకి సూటిగా ఎలా చూడగలుగుతారో చూడాలని ఉంది!: రేవంత్ రెడ్డి


'ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరారు. మరి మీరెప్పుడు చేరుతున్నారు?' అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నారాయణఖేడ్ లో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులను బెదిరించో, లేక తాయిలాలు చూపించో టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారడం సంగతి అటుంచి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు తన కళ్లలోకి సూటిగా ఎలా చూడగలుగుతారో చూడాలని ఉందని ఆయన చెప్పారు. అధికారం చేతిలో ఉందని ఫిరాయింపులకు పాల్పడుతున్న కేసీఆర్ పై పార్టీ కేడర్ ను ఏకం చేసి పోరాటం సాగిస్తామని ఆయన తెలిపారు. నేతలు మారినంత సులువుగా కార్యకర్తలు పార్టీ మారరని, వారే టీడీపీకి అండగా నిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకబడిన తరగతుల రక్షణకు వెలసిన టీడీపీని వారు కాపాడుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News