: ప్రేమికులకు.. జెట్ ఎయిర్ వేస్ ఆఫర్
మరో నాలుగు రోజుల్లో రానున్న వాలెంటెయిన్స్ డే (ప్రేమికుల రోజు) నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఆఫర్లు ప్రకటించింది. జెట్ ఎస్కేప్స్ పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను ఈరోజు ప్రకటించింది. ఇందుకోసం గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ-ఆగ్రా, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ప్యాకేజీలు ఈ నెల మొత్తం అందుబాటులో ఉంటాయని.. ఒక జంటకు రూ.31,975గా ప్రారంభ ధర ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది.