: మరో ఇద్దరు కలిస్తే టీడీపీని ఏకంగా విలీనం చేసేయచ్చు: ఎర్రబెల్లి


తమతో బాటుగా టీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరితే తెలంగాణలో ఆ పార్టీని అధికారికంగా విలీనం చేయవచ్చని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఓ పార్టీకి చెందిన మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మరో పార్టీలో చేరితే కనుక... ఆ పార్టీని అందులో విలీనం చేయచ్చని అన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరేందుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ప్రకటించారు. అలా జరిగితే పార్టీ ఫిరాయింపుల చట్టం మిగిలిన ఎమ్మెల్యేలపై వర్తించదని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీకి తెలంగాణలో ఇక స్థానం లేదని ప్రజలు నిర్ణయించారని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికలతో ఆ విషయం మరింత స్పష్టమైందని ఆయన తేల్చేశారు. గ్రేటర్ లో అంతా టీఆర్ఎస్ వెంటే నడిచారని, అలాంటప్పుడు టీఆర్ఎస్ లో చేరడమే మేలని తాము భావించామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News