: చంద్రబాబు అంటే చాలా అభిమానం...కానీ, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం: ప్రకాశ్ గౌడ్


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అంటే ఎంతో గౌరవమని రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయం సాధించినా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంద్రబాబు చాలా అభిమానంగా చూసుకున్నారని ఆయన చెప్పారు. అయితే, తమను గెలిపించిన ప్రజలకు ఏదైనా చేయాల్సిన బాద్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు గౌరవించి పార్టీ మారామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ విధానాలకు అనుగుణంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీడీపీని నొప్పించాలన్న ఉద్దేశం లేదని చెప్పిన ఆయన, తమ పరిస్థితిని వారు అర్థం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News