: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాశ్ గౌడ్ సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ లకు ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, తాజాగా వీరి చేరికతో టీడీపీ తరపున గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినట్టయింది.