: ఫ్యాక్స్ లో రాజీనామా లేఖలు పంపిన ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్
టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖలను ఫ్యాక్స్ లో పంపారు. కాగా, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న ఎర్రబెల్లి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరుతుండడంతో టీటీడీపీ నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా, కాసేపట్లో సీఎం కేసీఆర్ ను ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ కలవనున్నారు.