: గుంటూరు మిర్చి ఘాటు నషాళానికి!
గుంటూరు మిర్చి మరింత ఘాటెక్కింది. తేజ రకం మిర్చి క్వింటాల్ కు రికార్డు ధర నమోదు చేసింది. తేజ రకం మిర్చి ధర క్వింటాల్ కు రూ.15,500 పలకడం గుంటూరు యార్డు చరిత్రలో ఇదే ప్రథమం. దీని ధర నిన్నటి కంటే నేడు రూ.1000 పెరిగింది. గరిష్ఠ స్థాయిలో 341 సాధారణ రకం మిర్చి ధర రూ.15,300కు చేరింది. మిర్చి సాధారణ రకాలు పదమూడు, పధ్నాలుగు వేలకు పైగా పలుకుతున్నట్లు సమాచారం. ఇలా మిర్చి ధరలు అధికంగా పెరగడానికి కారణం ఈ సీజన్ లో దిగుబడి బాగా తగ్గడమేనని మిర్చి యార్డు వర్గాలు చెబుతున్నాయి.