: టీఆర్ఎస్ లో చేరుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు!
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. టీ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు స్వయంగా ఆయనే ప్రకటించారు. తనతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి వస్తున్నారని ఎర్రబెల్లి మీడియాకు తెలిపారు. హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి హరీష్ రావుతో ఎర్రబెల్లి సమావేశమయ్యారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదంటూ ఎర్రబెల్లి గతంలో పలుసార్లు పేర్కొన్నారు. అయితే, అందుకు భిన్నంగా ఆయన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.