: విజయవాడలో సందడి చేసిన హీరోయిన్ రెజీనా
ప్రముఖ సినీ నటి రెజీనా విజయవాడలో సందడి చేసింది. బెంజికంపెనీ సెంటర్ లో తహోమా కంపెనీకి చెందిన హ్యాండ్ క్రాఫ్ట్స్ షోరూంను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అనంతరం రెజీనా విలేకరులతో మాట్లాడుతూ, మంచు మనోజ్ హీరోగా, తాను హీరోయిన్ గా నటించిన 'శౌర్య' చిత్రం త్వరలో విడుదల కానుందని చెప్పింది. మరోపక్క, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక చిత్రంలో తాను నటిస్తున్నట్లు రెజీనా చెప్పింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెజీనాతో పాటు టీడీపీ నేత గద్దె రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. కాగా, ఆమెను చూసేందుకు అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు.