: అది ఉల్క పడడంతో జరిగిన పేలుడు కాదు!: నాసా


తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో భారతిదాస్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఇటీవల ఉన్నట్టుండి పేలుడు జరగడంతో ఓ వ్యక్తి చనిపోవడం, ముగ్గురు గాయపడడం కలకలం రేపింది. ఆకాశం నుంచి ఉల్క పడడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రభుత్వ అధికారులు ప్రకటించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు స్పందించారు. అది ఉల్క కాదని, భూమి నుంచే ఏదో పేలుడు సంభవించి ఉంటుందని, ఆకాశం నుంచి ఉల్క పడినట్టు అనిపించడం లేదని చెప్పారని ప్రముఖ వార్తాసంస్థ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తే, పేలుడు నేలపైనే జరిగి ఉంటుందని పేర్కొన్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News