: హనుమంతప్పకు కిడ్నీ ఇస్తామంటున్న మహిళలు


ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కిడ్నీ, లివర్ పాడైపోయాయంటూ వచ్చిన వార్తలతో పలువురు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు యూపీ మహిళ, రిటైర్డ్ కానిస్టేబుల్ స్పందించారు. తాను కిడ్నీ ఇస్తానని యూపీలోని లఖింపూర్ కు చెందిన నందనీ పాండే అనే మహిళ తెలిపారు. సియాచిన్ మంచు తుపానులో కూరుకుపోయి, 9 మంది చనిపోవడం తనను కలచివేసిందన్నారు. అందుకే ప్రాణాలతో బయటపడిన ఆ వీర జవాన్ కు కిడ్నీ దానం చేయాలనుకుంటున్నానని మీడియా ద్వారా ఆమె ప్రకటించారు. ఇక హనుమంతప్పకు కిడ్నీ ఫెయిలైందని తాను విన్నానని, అవసరమైతే తన కిడ్నీ దానం చేస్తానని సిఐఎస్ఎఫ్ కు చెందిన రిటైర్డ్ కానిస్టేబుల్ ప్రేమ్ స్వరూప్ కూడా ప్రకటించారు. వారితో పాటు లక్నోకు చెందిన మరో మహిళ, ఓ నేవీ మాజీ ఆఫీసర్ కూడా ఈ విషయంలో ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News