: ఎమ్మెల్యే చింతమనేని దాడి చేశారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారంటూ ఏలూరుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ మధు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నారని, ఈ సమయంలోనే కానిస్టేబుల్ పై ఆయన దాడి చేసినట్టు తెలిసింది. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది.