: 'ఐసిస్' భయంతో బ్రిటన్ లో ఓ పాఠశాల పేరు మార్పు!


ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం ఓ పాఠశాల పేరు మార్పుకు కారణమైంది. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ లో మూడు సంవత్సరాల కిందట 'ది ఐసిస్ (ఐఎస్ఐఎస్) అకాడమీ' పేరుతో ఓ పాఠశాలను స్థాపించారు. ఆటిజం వంటి మానసిక వైకల్యం కలిగిన పిల్లల కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ను కూడా ఐసిస్ పేరుతో పిలుస్తుండటం తెలిసిందే. దాని ప్రభావంగా ఈ పాఠశాలలో ఉగ్రవాద శిక్షణ ఇస్తారంటూ పుకార్లు వచ్చాయి. దాంతో తమపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేందుకుగాను పాఠశాల యాజమాన్యం పాఠశాల పేరును 'ద ఇప్లి అకాడమీ' అని పేరు మార్చుకుంది.

  • Loading...

More Telugu News