: ఉత్తరకొరియాకు ఝలక్కిచ్చిన దక్షిణకొరియా
ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ఝలక్కిచ్చింది. ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఉత్తర కొరియా ఇటీవల అణుపరీక్షలు నిర్వహించినందుకు నిరసనగా, తమ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పారిశ్రామికవాడ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. కెసొంగ్ ప్రాంతంలో ఉత్తర కొరియాతో కలిసి దక్షిణకొరియా పారిశ్రామికవాడలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని నుంచి వచ్చే ఆదాయంలో సింహభాగం ఉత్తరకొరియాకు వెళ్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం కూడా ఇదే. అణుపరీక్షలను వ్యతిరేకిస్తూ దీని నుంచి వైదొలగుతున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య విభేదాలు వచ్చినట్టు భావించవచ్చు.