: పోలీసుల చేతికి కొత్త ఆయుధం!


లాఠీ, తుపాకీలతో పాటు వడిశల (గులేర్) కూడా హర్యానా పోలీసుల చేతిలో ఆయుధం కానుంది. ఆందోళనలు, నిరసనలు హింసాత్మకంగా మారినప్పుడు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వడిశలను ఉపయోగించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని జింద్ జిల్లాలో పోలీసులకు వీటిని ఉపయోగించడంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. పెల్లెట్ గన్నుల వాడకం వల్ల గాయపడుతున్న ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, దానికి చెక్ పెట్టేందుకు వడిశలను ఆయుధంగా చేసుకోదలచామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఆయుధాలను ప్రయోగించడానికి బదులుగా వడిశలను ఉపయోగించడం ద్వారా నిరసనకారులకు పెద్దగా హాని జరగకుండా ఉంటుందని భావిస్తున్నారు. చిన్న చిన్న రాళ్లు, ప్రత్యేకంగా తయారు చేయించిన కారం గుళికలను వడిశెల ద్వారా ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొడతామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News