: విషమంగానే హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి: ఆర్మీ ఆసుపత్రి వైద్యులు
ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంచులో ఎక్కువ రోజులు ఉండటంవల్ల రక్తపోటు తగ్గిందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే ఆరు రోజుల పాటు మంచులో ఉన్నప్పటికీ ప్రాణాలతో ఎలా ఉండగలిగాడన్నది అతను స్పృహలోకి వస్తేనే తెలుస్తుందని, అంతవరకు ఏం జరిగిందో చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఆర్మీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను కర్ణాటక రెసిడెంట్ కమిషనర్ అతుల్ కుమార్ ఇవాళ చూశారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.