: ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం... ఈ నెల 14 నుంచి అమలు చేసే అవకాశం


దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన మంత్రులు, అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. ఈ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కాగా, ఈ నెల 14 నుంచి మార్చి 1, ఏప్రిల్ 1 నుంచి మే1 వరకు సరి-బేసి విధానాన్ని అమలుచేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15 వరకు అమలు చేసిన ఈ విధానం వల్ల ఢిల్లీలో కాలుష్యం స్థాయిలో కొంతవరకు మార్పువచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News