: బాలీవుడ్ నటి సన్నీలియోన్ పై కేసు
బాలీవుడ్ దర్శకుడు మిలప్ జవేరీ తెరకెక్కించిన సెక్స్ కామెడీ చిత్రం 'మస్తీజాదే' అందాల భామ సన్నీలియోన్ ని చిక్కుల్లో పడేసింది. ఈ సినిమా కోసం ఓ ఆలయంలో చిత్రీకరించిన సన్నివేశం అసభ్యకరంగా ఉండడమే కాకుండా, కండోమ్ ను ప్రమోట్ చేసే విధంగా ఉందంటూ ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ చిత్రంలో నటించిన సన్నీ, వీర్ దాస్, తుషార్ కపూర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటు దర్శకుడు మిలప్ జవేరీపై కూడా కేసు నమోదైనట్టు సమాచారం.