: కూలీగా మారిన నటుడు రానా!
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ మార్కెట్ లో ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మింది. నిన్న ఖమ్మంలో యువనటుడు అఖిల్ అక్కినేని ఆటో నడిపాడు. మరి, తాజాగా, నటుడు దగ్గుబాటి రానా 'రైతుబజార్'లో కూలీ అవతారమెత్తాడు. శ్రామికులకు చిహ్నంగా ఖాకీ దుస్తులు ధరించిన రానా తన నుదుటి మీదుగా ఎరుపు రంగు టవల్ ను చుట్టుకున్నాడు. కూరగాయల బస్తాలను తన వీపుపై మోశాడు. సినీనటి, టీవీ హోస్ట్ మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ టీవీ షో కోసం రానా ఈ అవతారం ఎత్తాడు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.