: కబడ్డీ పోటీలు బోర్ కొట్టగా, గుర్రు పెట్టి నిద్రపోయిన ఆరాధ్య!


బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ల గారాలపట్టి ఆరాధ్యకు కబడ్డీ ఆట ఎంత మాత్రమూ నచ్చనట్టుంది. ఓ వైపు ఈలలు, గోల, చప్పట్లతో స్టేడియం మారు మోగుతుంటే ఆరాధ్య, తల్లి ఒడిలో గుర్రు పెట్టి నిద్రపోయింది. తన తండ్రి అభిషేక్ బచ్చన్ ఓనర్ గా ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ టీమ్, బెంగళూరు బుల్స్ మధ్య కంఠీరవా స్టేడియంలో కబడ్డీ పోరు జరుగగా, తల్లిదండ్రులతో కలసి చూసేందుకు వచ్చిన ఆరాధ్య కాసేపే ఆనందంగా కనిపించిందని, ఆపై ఒకింత బుంగమూతితో ఆటను చూసి నిద్రపోయిందని తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కెమెరా కళ్లకు చిక్కాయి. ఇప్పుడా ఫోటోలు సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. ఓవైపు సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా, ఐశ్వర్యా రాయ్ లు తమ జట్టును ఉత్సాహపరుస్తుంటే ఆరాధ్య అయోమయంగా చూస్తోంది. ఆరాధ్య బోరింగ్ ఫేస్ అందరినీ ఆకర్షిస్తోందట. అంతేకదా? ఎంతైనా సెలబ్రిటీ బిడ్డ మరి!

  • Loading...

More Telugu News