: నవ్యాంధ్రకు ఒరాకిల్ సాయం... మంత్రి శిద్ధాతో భేటీ


నవ్యాంధ్ర అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించేందుకు ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ ఒరాకిల్ ముందుకు వచ్చింది. ఈ ఉదయం ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో కొత్త రహదారుల నిర్మాణానికి, పాత వాటి మరమ్మతులకు, అభివృద్ధికి తాము రూపొందించిన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని వారు వెల్లడించినట్టు సమాచారం. ఈ భేటీలో ఒరాకిల్ అత్యాధునిక టెక్నాలజీ గురించి పూర్తిగా ఆలకించిన శిద్ధా నూతన రహదారుల నిర్మాణ సమయంలో దీన్ని వాడుకుంటామన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఒరాకిల్ సంస్థల నడుమ ఎంఓయూ కుదరనుందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News