: అందరి కళ్ళూ అతడిపైనే..


ఐపీఎల్ లో అద్భుత విజయాలతో దూసుకెళుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఐపీఎల్-6లో తొలి మ్యాచ్ ఆడుతున్న తాజా సంచలనం శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఇక ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ అంటోన్న సన్ రైజర్స్.. సొంత గడ్డపై బలమైన జట్టుగా పేరుగాంచిన సూపర్ కింగ్స్ ల మధ్య జరిగే ఈ పోరులో విజేతలు ఎవరైనా గానీ, మస్త్ మజా మాత్రం గ్యారంటీ అని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, రాజకీయ కారణాలతో లంక క్రికెటర్లు సంగక్కర, పెరీరా ఈ మ్యాచ్ కు దూరమవుతున్నారు.

  • Loading...

More Telugu News