: విద్యుత్ కోతలపై ఆగ్రహించిన రైతులు
విద్యుత్ కోతలపై కృష్ణా జిల్లా రైతాంగం కన్నెర్ర జేసింది. ముసునూరు మండలంలోని 14 గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు నూజివీడు-హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు నూజివీడు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు, రోజుకు కనీసం 5 గంటల విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.