: స్మార్ట్ సిటీల్లో అమెరికా భాగస్వామ్యం... 100 నగరాల అభివృద్ధికి సహాయం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ నగరాల ప్రాజెక్టుపై అమెరికా ఆసక్తి వ్యక్తం చేసింది. మొత్తం 100 నగరాలకు సాంకేతిక సహకారం, మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశ వాణిజ్య ఉపమంత్రి బ్రూస్ ఆండ్రూస్ వెల్లడించారు. దాంతో నగరాల అభివృద్ధిలో తామొక విలువైన భాగస్వామి అవుతామని పేర్కొన్నారు. ఆయనతో పాటు 18 అమెరికన్ కంపెనీల ప్రతినిధుల బృందం ఐదు రోజుల భారత్ పర్యటనకు వచ్చింది. ఇప్పటికే విశాఖపట్టణాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు రూపొందించే మాస్టర్ ప్లాన్ కు; అలహాబాద్, అజ్మీర్ నగరాలకు సాంకేతిక సాయం అందిస్తున్నామని యూఎస్ ట్రేడ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ లియోకాడియా జాక్ వివరించారు.