: పెళ్లి వయసు దాటేసింది... ముగ్గురో నలుగురో పిల్లలు కావాలనిపిస్తోంది: సల్మాన్ ఖాన్ నిర్వేదం


సల్మాన్ ఖాన్... 50 ఏళ్ల ఈ బాలీవుడ్ కండల వీరుడు ఇప్పటికీ ఇండియాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటే అంగీకరించాల్సిందే. అందమైన ముఖం, ఆకర్షించే శరీరం ఇతని సొంతం. కానీ ఎందుకో సల్మాన్ మనసు ఇప్పటివరకూ పెళ్లి మీదకు పోలేదు. హిందీ చిత్ర రంగంలో 'ప్రేమ్'గా గుర్తింపున్న సల్మాన్, పూణెలోని ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తున్న వేళ, చర్చ అతని పెళ్లి మీదకు మళ్లింది. తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందని, అయినా తాను సంతోషంగానే ఉన్నానని వెల్లడించిన సల్మాన్, ఓ ముగ్గురో, నలుగురో పిల్లలు ఉంటే బాగుండేదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించాడు. ఇండియాలో వివాహం కాకుండా పిల్లల్ని కనడం చట్టపరంగా కష్టమన్న సంగతి అతనికి తెలిసే ఉంటుందని, ఈ కథనాన్ని ప్రచురించిన 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' అభిప్రాయపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News