: హనుమంతప్ప త్వరగా కోలుకోవాలంటూ జగన్ ట్వీట్
సియాచిన్ ఘటన నుంచి బయటపడిన ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు "సియాచిన్ మంచు తుపాను నుంచి మృత్యుంజయుడైన లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా" అంటూ ఆయన ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను కోమాలో ఉన్నాడు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు హనుమంతప్ప కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.