: ‘సియాచిన్’ మృతుల్లో కర్నూలు జిల్లా వాసి... పార్నపల్లెలో విషాద ఛాయలు


జమ్మూ కాశ్మీర్ లోని సియాచిన్ ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న పది మంది సైనికుల్లో లాన్స్ నాయక్ హనుమంతప్ప మినహా మిగిలిన వారంతా మృత్యువాత పడ్డారు. పది మంది సైనికుల ఆచూకీ కోసం ఆరు రోజులుగా జరిగిన ముమ్మర గాలింపులో భాగంగా ప్రాణాలతో బయటపడ్డ హనుమంతప్పకు సమీపంలో మిగిలిన తొమ్మిది మంది సైనికుల మృతదేహాలను గాలింపు బృందాలు కనుగొన్నాయి. మృతుల్లో తెలుగు నేలకు చెందిన ఓ సైనికుడు కూడా ఉన్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా పార్నపల్లెకు చెందిన ముస్తాక్ అహ్మద్ గతంలోనే సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా మొన్న భద్రతా పర్యవేక్షణకు సియాచిన్ వెళ్లిన వారిలో ముస్తాక్ కూడా ఉన్నారు. ఉన్నపళంగా విరుచుకుపడ్డ మంచు తుపానులో వీరంతా చిక్కుకున్నారు. ముస్తాక్ కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ముస్తాక్ మరణ వార్తతో పార్నపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News