: దాసరి, చిరంజీవిలకు కిర్లంపూడి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?: చంద్రబాబు


కాపు రిజర్వేషన్ ఉద్యమం నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కులాధారిత రాజకీయాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. కిర్లంపూడికి దాసరి నారాయణరావు, చిరంజీవి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాపుల కోసం పార్టీ పెట్టానని చెప్పిన చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు కలిపారో వారికేనాడైనా వివరించారా? అని ఆయన నిలదీశారు. కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాపు గర్జన సందర్భంగా కొన్ని శక్తులు కావాలనే అరాచకాలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News