: టీమిండియాకు చెమటలు పట్టించిన శ్రీలంక బౌలర్లు...59/7


ప్రపంచంలో అత్యుత్తమ టాపార్డర్ అంటూ వారం రోజుల క్రిందట వెటరన్ లు, విశ్లేషకుల ప్రశంసలు పొందిన టీమిండియా శ్రీలంక యువబౌలర్ల ముందు తేలిపోయింది. నిప్పులు చెరిగే బంతులతో టీమిండియాను వారు ఓ ఆటాడుకున్నారు. కేవలం పది ఓవర్లకే జట్టులోని టాపార్డర్ సహా సగం మందిని పెవిలియన్ బాటపట్టించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి నిప్పులు చెరిగిన రజిత తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ (0), రహానే (4)ల వికెట్లు తీశాడు. మూడో ఓవర్ లో మరోసారి బంతిని చేతుల్లోకి తీసుకున్న రజిత శిఖర్ ధావన్ (9) ను పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం అద్భుతమైన బంతితో రైనా (20) ను శనక బౌల్డ్ చేశాడు. మరో అద్భుతమైన బంతితో ధోనీ (2) ని బోల్తా కొట్టించాడు. ఈ దశలో క్రీజులో కుదురుకున్నాడని భావించిన యువరాజ్ (10) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. అనంతరం వచ్చిన హార్డిక్ పాండ్య (2) బంతిని అంచనా వేయడంలో పొరబడి ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లు ఆడిన భారత జట్టు 59 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక ఆగాళ్లలో రజిత, శనక చెరి మూడు వికెట్లతో రాణించగా, ఒక వికెట్ తీసి చమీర చక్కని సహకారమందించాడు.

  • Loading...

More Telugu News