: మోదీ, దావూద్ ను కలిశారని నిరూపించమనండి... లేదా మంత్రిని తొలగించండి: యూపీ బీజేపీ డిమాండ్
ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను కలిసినట్టు ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లక్నోలో యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదూర్ పాఠక్ మాట్లాడుతూ, ఆజంఖాన్ చేసిన ఆరోపణను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సూచించారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆజంఖాన్ ను సమాజ్ వాదీ పార్టీ వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలకు దావూద్ డబ్బులు ఖర్చు చేశాడని ఆజంఖాన్ అన్నారని, అది నిజమా? అని ఆయన మరోసారి ప్రశ్నించారు. ఆజంఖాన్ పిచ్చి వాగుళ్లు ఇక కట్టిపెట్టాలని ఆయన సూచించారు.