: ఫస్ట్ ఓవర్ లోనే రెండు వికెట్లు డౌన్... కష్టాల్లో టీమిండియా


పూణే వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన టీ20 మ్యాచ్ లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. లంక బౌలర్ కసున్ రజిత వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే టీమిండియా రెండు వికెట్లు చేజార్చుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ తన తురుపు ముక్కలను టీమిండియాపై ప్రయోగించాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (0) డకౌటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అజింక్యా రెహానే (4) వచ్చీరాగానే బ్యాటును ఝుళిపించి ఓ ఫోర్ కొట్టి వెనువెంటనే ఔటయ్యాడు. తొలి ఓవర్ లో రెండో బంతికి రోహిత్, చివరి బంతికి రెహానేను రజిత పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్(1)కు సురేశ్ రైనా (3) జతకలిశాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 10 పరుగులు చేసి కష్టాల్లో పడింది.

  • Loading...

More Telugu News