: ఇప్పుడు నేను ఒంటరిని...ఛలో డ్యాన్స్ చేద్దాం: కోహ్లీ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 'సోలో బతుకే సో బెటరు' అంటూ సంబరపడిపోతున్నాడని ముంబై మిర్రర్ పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల అంగద్ బేడీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన సన్నివేశాన్ని వెల్లడించింది. ఈ వేడుకలకు హాజరైన కోహ్లీ తన సన్నిహితులతో ఉత్సాహంగా కనిపించాడట. అనుష్కతో ప్రేమలో పడడానికి ముందు ఉన్నంత హుషారుగా అందర్నీ పలకరిస్తూ, చిందులేస్తూ సందడి చేశాడట. ఈ సందర్భంగా అత్యంత సన్నిహితులతో 'ఇప్పుడు నేను ఒంటరిని, ఛలో డ్యాన్స్ చేద్దాం' అంటూ పిలిచాడట. దీంతో అక్కడున్నవారు అనుష్కతో బ్రేకప్ వార్తలు వాస్తవమేనని నిర్ధారించుకున్నారట. 'అనుష్క కంట్రోలింగ్ గర్ల్ ఫ్రెండ్ అని, ఎప్పుడూ ఆమె జపం చేయాల్సి వచ్చేదని' వారితో చెప్పుకుని కోహ్లీ వాపోయినట్టు ఆ సంభాషణ విన్న వారు తెలిపారు. ప్రేమికుల రోజును అనుష్కతో గడిపేందుకు కోహ్లీ శ్రీలంక టీట్వంటీ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటే, అనుష్క మాత్రం సల్మాన్ తో 'సుల్తాన్' షూటింగ్ లో తీరిక లేకుండా గడుపుతోందని ముంబై మిర్రర్ కథనం ప్రచురించింది. దీంతో వారి బ్రేకప్ వాస్తవమేనని పలువురు అంగీకరిస్తున్నారు.