: హెలికాప్టర్ తయారు చేసుకున్న మెకానిక్!


ప్రతిభకు డిగ్రీలతో పని లేదని అసోం రాజధాని దిస్ పూర్ సమీపంలోని ఏజెన్సీ గ్రామంలో నివాసముండే శివోక్తి శర్మ నిరూపించాడు. అసోంలోని శ్యాంజులి అనే గ్రామంలో శివోక్తి మెకానిక్ గా పని చేస్తున్నాడు. ఆ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఉన్న రోడ్డు ఎప్పుడూ బాగోదని భావించిన శివోక్తి శర్మ, దీనికి పరిష్కారంగా గాలిలో వెళ్లడమే మేలని భావించాడు. దీంతో, ఆకాశ మార్గాన్ని ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా నెమ్మదిగా పనులు ప్రారంభించాడు. పలుమార్లు విఫలమైనా మొక్కవోని పట్టుదలతో ఇద్దరు కూర్చుని ప్రయాణించే వీలున్న హెలికాప్టర్ ను తయారు చేశాడు. దీనిని భూమికి 30 నుంచి 50 అడుగుల ఎత్తులో నడిపించి విజయవంతగా పరీక్షించినట్టు కూడా తెలుస్తోంది. ఈ హెలికాప్టర్ తయారీకి 15 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు ఆయన వెల్లడించాడు. దీంతో ఆయన అక్కడ సెలబ్రిటీగా మారాడు.

  • Loading...

More Telugu News