: నా విలువ తెలిసిన వారితోనే పని చేస్తా: సోనమ్ కపూర్


తన విలువ తెలిసిన వారితోనే తాను పని చేస్తానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పష్టం చేసింది. ముంబైలో జరిగిన 'విమెన్ ఆఫ్ వర్త్' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోనమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో పారితోషికం విషయంలో నటులు, నటీమణుల మధ్య భేదభావం ఉందని తెలిపింది. తాను మాత్రం తన విలువ తెలిసిన వారితోనే పని చేస్తానని స్పష్టం చేసింది. తన పట్ల ఏమాత్రం అగౌరవంగా ప్రవర్తించినా వారితో పని చేయనని తెగేసి చెప్పింది. కాగా, సోనమ్ 'నీరజ' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News