: తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణకు నార్వే బృందం ఆసక్తి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో ఇవాళ నార్వే బృందం సమావేశమైంది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం అనుకూలమైనదని, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి వారిని కోరారు. ఇందుకు స్పందించిన నార్వే బృందం, స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన, చెరువుల పునరుద్ధరణ వంటి అంశాలపై ఆసక్తి చూపిందని కేటీఆర్ తెలిపారు. అంతేగాక, వాల్ మార్ట్ తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని వెల్లడించారు. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.