: మోదీ దత్తత గ్రామానికి ఉచిత విద్యుత్ ఆఫర్
వారణాసి పార్లమెంటరీ నియోజక వర్గంలోని జయపూర్ అనే గ్రామానికి మహర్దశ పట్టుకుంది. ఈ ఊరిలో ఉన్న 810 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు వెల్సన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం సోలార్ ఎనర్జీ పానెల్స్ అందించనుంది. వాటితో ఆ ఊరికి ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. దానంతటికీ కారణం, ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ దత్తత గ్రామం కావడమే. ప్రస్తుతం ఈ గ్రామంలో 25 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు ప్లాంట్ల ద్వారా 720 కుటుంబాలకు ఉచిత్ విద్యుత్ ను అందిస్తున్నట్టు గ్రామానికి చెందిన శ్రీనారాయణ్ పటేల్ తెలిపారు. సోలార్ ఎనర్జీ పానెల్స్ తో ఊరంతటికీ విద్యుత్ వస్తుందని అంటున్నారు.