: దళితులను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కల్పన


ఎస్సీలను కించపరిచేలా మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కింద నుంచి పైదాకా కుల వివక్ష ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. దళితులను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు బాబు చాలాసార్లు చేశారని, దళితులు-బీసీ ల మధ్య తగాదాలు పెట్టింది చంద్రబాబేనని ఆమె ఆరోపించారు. ఎస్సీల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా బాబు వ్యాఖ్యలు చేయడాన్ని అవమానంగా భావిస్తున్నామని కల్పన అన్నారు.

  • Loading...

More Telugu News