: ఖమ్మంలో ఆటో నడిపిన అఖిల్ అక్కినేని!


టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేని ఖమ్మంలో ఆటో నడిపాడు. ఖమ్మంలో అఖిల్ ఆటో నడపడమేంటనే డౌట్ వచ్చిందా?...ప్రముఖ నటి మంచు లక్ష్మీప్రసన్న తాను నిర్వహిస్తున్న 'మేము సైతం' టీవీ కార్యక్రమం ద్వారా ఆపన్నులను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో సినిమా సెలబ్రిటీలు పాల్గొని, కాసేపు తమకు నచ్చిన వృత్తిని స్వీకరించి, దాని ద్వారా సంపాదించిన మొత్తానికి కొంత మొత్తాన్ని కలిపి ఆపదలో ఉన్నవారికి సహాయపడుతున్నారు. హిందీ టీవీ ఛానెల్ 'కలర్స్'లో ప్రసారమయ్యే 'మిషన్ సప్నే'ను పోలిన ఈ కార్యక్రమంలో తాజాగా అఖిల్ పాల్గొన్నాడు. అందులో భాగంగా ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో ఆటో నడిపాడు. తద్వారా మూడు వేల రూపాయల మొత్తం రాగా, దానికి నిర్వాహకులు 2,97,000 రూపాయలు జత చేసి మూడు లక్షల రూపాయలను అక్కడ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి అందజేశారు. గత వారం ఈ కార్యక్రమం కోసం హైదరాబాదు, కూకట్ పల్లి రైతుబజార్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలమ్మిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News