: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ సీజన్-9కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఎంపికయ్యాడు. 'కిల్లర్' మిల్లర్ గా పేరొందిన డేవిడ్ మిల్లర్ ను పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంపిక చేశాడు. తనదైన రోజున మిల్లర్ ను ఆపడం అసాధ్యమని బంగర్ పేర్కొన్నాడు. 134 స్ట్రయిక్ రేట్ తో మిల్లర్ గత సీజన్ లో పరుగులు చేశాడని బంగర్ తెలిపాడు. మిల్లర్ లో కెప్టెన్సీ సామర్థ్యం ఉందని భావించి ఈ బాధ్యతను అప్పగించామని పేర్కొన్నాడు. కాగా, ఈ జట్టు సహయజమానిగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్ లో పంజాబ్ జట్టులో కీలక బ్యాట్స్ మన్ గా ఉండి, ఆ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్ ఈసారి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు.