: 'గభరావ్ మత్...హమ్ ఆగయ్': హనుమంతప్పతో సైనికుల తొలి మాటలు


సియాచిన్ గ్లేసియర్ లో 25 అడుగుల లోతు మంచులో కూరుకుపోయిన లాన్స్ నాయక్ హనుమంతప్పను వెలికి తీసిన వీడియో పుటేజ్ ను మీడియాకు విడుదల చేశారు. సహచరులు ఏ ఒక్కరైనా బతికి ఉంటారన్న ఆశతో సైనికులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అడుగుల కొద్దీ మంచును తొలగించుకుంటూ వెళ్లగా.. కర్ణాటకకు చెందిన హనుమంతప్ప కదులుతూ కంటబడగానే, మంచు తొలగిస్తున్న సైనికుల్లో ఆనందం చోటుచేసుకుంది. సహచరుల గొంతు వినబడగానే హనుమంతప్ప లేచే ప్రయత్నం చేశారు. వెంటనే అతనిని వారించిన సైనికులు కదలవద్దని సూచించారు. కదిలితే మంచు మీద పడే అవకాశం ఉందని 'గభరావ్ మత్ (గాభరా పడకు)..హమ్ ఆగయ్ (మేము వచ్చేశాం)...శాస్ లేలో (బాగా ఊపిరి పీల్చుకో)'అంటూ సహచరుడికి ఏం చేయాలో సూచించారు. మంచు తొలగిస్తూనే మరో సహచరుడికి 'ఓయ్...కంబల్ లేకే ఆవ్ తూ (ఓయ్...నువ్వు రగ్గు తీసుకునిరా)' అంటూ హెచ్చరించారు. హనుమంతప్పను జాగ్రత్తగా బయటకు తీసిన సైనికులు హుటాహుటీన స్థావరంలోనికి చేర్చి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఢిల్లీకి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా, హనుమంతప్ప కర్ణాటక వాసిగా వార్తలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News