: షూటింగ్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది: శ్రద్ధా కపూర్
షూటింగ్ లేకపోతే తనకి పిచ్చెక్కిపోతుందని బాలీవుడ్ యువనటి శ్రద్ధా కపూర్ తెలిపింది. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో ఆమె మాట్లాడుతూ, షూటింగ్ ఉంటే కనుక ఆ రోజు హాయిగా గడిచిపోతుందని చెప్పింది. పొరపాటున షూటింగ్ లేకపోతే ఆ రోజు ఏం చేయాలో తనకు తోచదని పేర్కొంది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఉన్న ఇష్టం కారణంగా చదువును కొనసాగించలేకపోయానని చెప్పిన శ్రద్ధా కపూర్, అలా ఎవరూ మధ్యలో చదువును ఆపేయకూడదని స్పష్టం చేసింది. షాహిద్ కపూర్ అద్భుతమైన నటుడని చెప్పింది. 'హైదర్' సినిమాలో షాహిద్ సన్నివేశంలో లీనమై నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేదానినని, దీంతో రీటేక్ లు తీసుకోవాల్సి వచ్చేదని, అందువల్ల చాలాసార్లు షాహిద్ కు సారీ కూడా చెప్పానని శ్రద్ధా కపూర్ తెలిపింది. అభిమానుల కోరిక మేరకు ఆమె నటించిన సూపర్ హిట్ సినిమా 'ఆషికీ 2'లోని 'తుమ్ హి హో' పాటను పాడి అభిమానులను అలరించింది.