: రామ్ చరణ్ 'జంజీర్' విడుదలపై సుప్రీం స్టే
మెగా తనయుడు రామ్ చరణ్ బాలీవుడ్ చిత్రం 'జంజీర్' విడుదలపై సుప్రీంకోర్టు నేడు స్టే విధించింది. సుప్రీం ఉత్తర్వుల కారణంగా 'జంజీర్' విడుదల ఆరు వారాలు ఆలస్యం కానుంది. ఈ ఆరు వారాల్లోగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్మాతలకు సుప్రీం సూచించింది. సినిమా రీమేక్ హక్కుల విషయంలో చిత్ర నిర్మాత అమిత్ మెహ్రాపై అతని సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అమిత్ తమకు పూర్తి సొమ్ము చెల్లించలేదని వారు ఆరోపించారు. అమితాబ్ అలనాటి హిట్ చిత్రం 'జంజీర్' ను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.