: సజీవంగా బయటపడిన సైనికుడికి మోదీ పరామర్శ
సియాచిన్ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఆర్మీజవాను లాన్స్ నాయక్ హనుమంతప్పను ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలని ట్విట్టర్ లో మోదీ కోరారు. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఆ సైనికుడిని పరామర్శించారు. కాగా అతని ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.