: వివిధ పార్టీలకు వెల్లువెత్తిన విరాళాలు... కాంగ్రెస్ ను దాటిపోయిన బీజేపీ!


గడచిన ఆర్థిక సంవత్సరంలో వివిధ పార్టీలకు అందిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థల నివేదిక విడుదలైంది. ఈ రిపోర్టు వివరాల ప్రకారం 2014-15లో బీజేపీ అత్యధికంగా రూ. 437.35 కోట్ల విరాళాలు స్వీకరించింది. మొత్తం 1234 మంది నుంచి ఈ విరాళాలు అందాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి రూ. 138.98 కోట్ల విరాళాలు లభించాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కాంగ్రెస్ కు విరాళాలు తగ్గగా, బీజేపీకి గణనీయంగా పెరిగాయి. ఇక ఢిల్లీలో రాజ్యమేలుతున్న ఆప్ కు వచ్చిన విరాళాల మొత్తం 275 శాతం పెరిగి రూ. 44.71 కోట్లకు చేరింది. ఈ పార్టీకి వచ్చిన విరాళాల్లో అత్యధికం విదేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. పూర్తి పారదర్శకత తమ సొంతమని చెప్పుకునే ఆప్ నేతలు, తమకు విరాళాలిచ్చిన 111 మందికి సంబంధించిన పేర్లు, పాన్ ఖాతాలను చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. మరో ప్రాంతీయ పార్టీ ఎన్సీపీకి వచ్చిన విరాళాల మొత్తం గత సంవత్సరంతో పోలిస్తే 177 శాతం పెరిగి రూ. 14.02 కోట్ల నుంచి రూ. 38.82 కోట్లకు పెరిగిందని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News