: పెళ్లి ఫొటోల పిచ్చి తారస్థాయికి... హీరోలు రానా, నిఖిల్, సిద్ధార్థ్ లు ట్వీట్ చేసిన ఫోటో ఇది!
వివాహాది శుభకార్యాలు జరుగుతున్న వేళ, ఆ మధురానుభూతులను కలకాలం దాచుకునేందుకు, తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని గుర్తు చేసుకునేందుకు ఫొటోలు, వీడియోల రూపంలో వాటిని భద్రపరచుకోవడం అందరికీ తెలిసిందే. ఇది డిజిటల్ యుగం. ఎంత కొత్త యాంగిల్ లో ఫోటో వస్తే, అంత బాగున్నట్టుగా భావించే రోజులు. ఇక వివాహం అయిన తరువాత వధూవరులను ఒకచోట చేర్చి వారితో రకరకాల విన్యాసాలు చేయిస్తూ, ఫోటోలు తీసే వారినీ మనం చూశాం. కానీ ఈ ఫోటో మరో వెరైటీ. వధూవరులు ఇద్దరూ చేతులు పట్టుకుని ఎదురెదురుగా నిలుచున్న వేళ, ఫొటోగ్రాఫర్ వారిద్దరి కాళ్ల మధ్యనా పడుకొని మరీ, కింద నుంచి వాళ్ల 'కలిసిన చేతుల'ను ఫోటో తీస్తుండగా, ఆ దృశ్యాన్ని మరొకరు తన మొబైల్ లో తీసుకున్నారు. ఈ ఫోటో అలా అలా మన టాలీవుడ్ హీరోలకు చేరింది. హీరో నిఖిల్, సిద్ధార్థలు దీన్ని ట్వీట్ చేయగా, దగ్గుబాటి రానా రీట్వీట్ చేశాడు. పెళ్లి ఫోటోల పిచ్చి తారస్థాయికి చేరిందని చెప్పేందుకు సరైన సాక్ష్యంగా నిలుస్తున్న ఈ చిత్రాన్ని మీరూ చూడండి!