: సనాతన ధర్మమే శ్రీరామరక్ష... రాజకీయాలూ అందులో భాగమేనన్న బీజేపీ!


వచ్చే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, హిందువుల ఓట్లు కీలకమని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ మతాన్ని గుర్తుకు తెచ్చేలా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారతావనిని సనాతన ధర్మమే కాపాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజకీయాలు మతంలో భాగంగానే ఉంటాయని, కానీ, ఇండియాలో వాటిని విడగొట్టారని ఆయన ఆరోపించారు. బృందావనంలో రాధాకృష్ణులకు అంకితం చేస్తూ నిర్మించిన 125 అడుగుల 'ప్రియాంతక్జూ'ను అమిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, దీర్ఘకాలంగా ధర్మం, రాజకీయాల మధ్య దూరం పెరుగుతూ వచ్చిందని, మోదీ ప్రభుత్వం తిరిగి దేశాన్ని ధర్మం వైపు నడిపించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా, ప్రపంచానికి హిందూ మతానికి చెందిన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను పరిచయం చేసే ప్రభుత్వం ఇక్కడ ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News