: టీడీపీ ఎమ్మెల్యేల మెడపై కత్తిపెట్టి లొంగదీసుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ లో చేరుతుండటంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యేల మెడపై కత్తిపెట్టి లొంగదీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్నదంతా ప్రజలు గమనిస్తున్నారన్న రేవంత్, ఇకనైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యహరించాలని సూచించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై ఫిర్యాదు చేస్తే స్పీకర్ చర్య తీసుకోరని ఆరోపించారు. ఇకనైనా పార్టీ పిరాయింపులపై పార్లమెంటులో చట్టసవరణ చేయాలని రేవంత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.