: సీఎం సాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా... గుంటూరు మహిళ ఆక్రందన


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తన బాధను చెప్పుకునేందుకు వెళ్లిన ఒక మహిళను నెల రోజుల నుంచి అనుమతించని సంఘటన వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన జె. పద్మావతి ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా ఆమె భర్త కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తనకు సాయం చేయాలని కోరేందుకు తన ముగ్గురు పిల్లలతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ఆమె తిరుగుతోంది. ఎన్నిసార్లు అక్కడికి వెళ్లినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ప్రధాన గేటు వద్దే నిలిపివేస్తున్నారు. వినతిప్రతం ఇస్తే, దానిని పరిశీలించిన తర్వాత ఆమెను లోపలికి అనుమతిస్తామంటూ భద్రతా సిబ్బంది నెల రోజులుగా ఇదే మాట ఆమెకు చెబుతున్నారు. దీంతో, విసిగిపోయిన ఆమె, సీఎంను కలిసే వరకు తాను వెళ్లేది లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది స్పందించకపోవడంతో, తన ముగ్గురు పిల్లలతో కలిసి రోడ్డుపైనే కూర్చుంది. ముఖ్యమంత్రి సాయం చేయకపోతే తాను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆమె బోరున విలపిస్తోంది.

  • Loading...

More Telugu News